Breaking News: అనకాపల్లిలో తీవ్ర విషాదం.. హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు మృతి

Breaking News
x

Breaking News

Highlights

Breaking News: అనకాపల్లి జిల్లా కోట ఊరుట్లలో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్ పాయిజన్‌తో హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.

Breaking News: అనకాపల్లి జిల్లా కోట ఊరుట్లలో విషాదం చోటు చేసుకుంది. అనుమతుల్లేని హాస్టల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. కైలాసపట్నంలో పాషా ట్రస్ట్ పేరుతో అనుమతుల్లేని హాస్టల్ నడుపుతున్నారు కిరణ్ కుమార్ అనే వ్యక్తి. ఇందులో 86 మంది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇక్కడ వసతి పొందుతూ సమీప ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. శనివారం రాత్రి భోజనాలు చేసి నిద్రించిన పిల్లలకు ఆదివారం తెల్లవారుజామున ఏడుగురికి వాంతులు అయ్యాయి. దీంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి వారి పేరెంట్స్‌తో ఇళ్లకు పంపించారు. మొత్తం 27 మంది వాంతులతో అస్వస్థతకు గురవగా.. ఈ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు మొత్తం 86 మంది పిల్లలు. ఇంటికి వెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజామున ముగ్గురు పిల్లలు చనిపోయినట్లుగా సమాచారం తెలుసుకొని స్థానిక మండల విద్యాధికారి శ్రీ జోష్, డిప్యూటీ తహశీల్దార్, హాస్టల్ వివరాలు సేకరించారు. హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ పై కేసు నమోదు చేసి, హాస్టల్‌ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories