Tirumala: తిరుమలలో విషాదం..గ్రిల్స్ నుంచి పడి బాలుడు దుర్మరణం

Tragedy in Tirumala Boy dies after falling from grills
x

Tirumala: తిరుమలలో విషాదం..గ్రిల్స్ నుంచి పడి బాలుడు దుర్మరణం

Highlights

Tirumala: తిరుమలలో విషాదం నెలకొంది. వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి కిందపడి మూడేళ్ల బాలుడు మరణించాడు. కడపకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం...

Tirumala: తిరుమలలో విషాదం నెలకొంది. వసతి సముదాయం రెండో అంతస్తు నుంచి కిందపడి మూడేళ్ల బాలుడు మరణించాడు. కడపకు చెందిన ఓ కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు చేరుకుంది. తిరుపతిలోని కౌంటర్ల దగ్గర శ్రీవారి దర్శనం కోసం టోకెన్లు తీసుకుంది. జనవరి 16వ తేదీ శ్రీవారి దర్శనం కోసం టోకెన్ కేటాయించారు. దీంతో ఆ కుటుంబం మొత్తం బుధవారం తిరుమల కొండపైకి చేరుకుంది. ఓ లాకర్ అద్దెకు తీసుకున్నారు. అయితే వసతి సముదాయం దగ్గర అనుకోకుండా జరిగిన ప్రమాదంలో బిడ్డను కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్లితే..కడప పట్టణంలోని చిన్న చౌక్ కు చెందిన శ్రీనివాసులు కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. జనవరి 13వ తేదీ శ్రీనివాసులు, ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి తిరుపతికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి జనవరి 16వ తేదీన దర్శనం టోకెన్లు కేటాయించారు. దీంతో శ్రీనివాసులు కుటుంబంతో కలిసి బుధవారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పద్మనాభ నిలయంలో లాకర్ తీసుకున్నారు. అయితే సాయంత్రం 5గంటల సమయంలో శ్రీనివాసులు ఇద్దరు కొడుకులు పద్మనాభ నిలయంలోని రెండో అంతస్తులు అడుకుంటున్నారు.

ఈ క్రమంలోనే అన్నతో కలిసి ఆడుకుంటున్న రెండో కుమారుడు మూడేళ్ల సాత్విక్ శ్రీనివాసరాజు అనుకోకుండా ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి కిందికి జారి పడ్డాడు. గ్రిల్స్ మధ్యలో నుంచి సాత్విక్ జారి పడినట్లు తెలిపింది. దీంతో సాత్విక్ కు తీవ్రగాయాలయ్యాయి. సాత్విక్ తల్లిదండ్రులు అక్కడున్న సిబ్బంది వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాత్విక్ మరణించాడు. దీంతో ఆ కుటుంబం గుండెలు పగులేలా రోదిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వస్తే తమకు గర్భశోకం కలిగిదంటూ సాత్విక్ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories