Top-6 News of the Day: ఏపీ మాజీ సీఎం జగన్ పై కేసు మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day (12/07/2024)
x

Y S Jagan

Highlights

1. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదుతెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఆంధ‌్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారి పీవీ...

1. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై కేసు నమోదు

తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు మేరకు ఆంధ‌్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ సహా పలువురిపై గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 మే 14న తనపై హత్యాయత్నం చేశారని.. రబ్బరు బెల్ట్, లాఠీలతో కొట్టారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.


2. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం: దానం నాగేందర్

బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందని ఆయన చెప్పారు. ఆ పార్టీపై నమ్మకం లేకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహా మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది.


3. లిక్కర్ స్కాంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

లిక్కర్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 9న దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న సుప్రీంకోర్టు మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. జూలై 12న తీర్పును వెలువరించింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. సీబీఐ కేసులో అరెస్టైనందును ఆయన ఇంకా తీహార్ జైల్లోనే ఉంటారు.


4. హైద్రాబాద్ నాంపల్లిలో దోపీడీ దొంగలపై పోలీసుల కాల్పులు

హైద్రాబాద్ లో దోపీడీ దొంగలు పోలీసులపై దాడికి దిగారు. దుండగులపై పోలీసులు కాల్పులకు దిగారు. దాడికి దిగిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితులను మంగరిబస్తీకి చెందిన రాజ్, హబీబ్ నగర్ నాలాకు చెందిన కాజా అలియాస్ అయాస్ గా గుర్తించారు. వీరిద్దరూ పిక్ పాకెటర్లని పోలీసులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిందితులు పోలీసులపై గొడ్డలి, రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు.


5. నేపాల్ లో కొండచరియలు విరిగి నదిలో పడిన రెండు బస్సులు.. 65 మంది గల్లంతు

నేపాల్ లో శుక్రవారం జరిగిన తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో 65 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. నేపాల్ లోని నారాయణఘాట్-ముగ్ లింగ్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో అదే మార్గంలో ప్రయాణీస్తున్న రెండు బస్సులు పక్కనే ఉణ్న త్రిశూన్ నదిలో పడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు సహా 65 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది.


6. ఫోన్ ట్యాపింగ్ కేసు: నిందితుల బెయిల్ పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టి వేసింది. రాష్ట్రంలో పలువురు రాజకీయ నాయకులు,జర్నలిస్టుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలున్నాయి.ఈ విషయమై ఏర్పాటు చేసిన సిట్ నిందితులను విచారిస్తోంది. ఈ కేసులో అరెస్టైన నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories