CM Jagan: రేపు విజయనగరంలో సీఎం జగన్ పర్యటన

CM Jagan Visit To Vizag Tomorrow
x

CM Jagan: రేపు విజయనగరంలో సీఎం జగన్ పర్యటన

Highlights

CM Jagan: భోగాపురం విమానాశ్రయ శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి

CM Jagan: రేపు విజయనగరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. శంకుస్థాపన అనంతరం GMR సంస్థ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనుంది. అందుకు సంబంధించిన ల్యాండ్ ను ఇప్పటికే అధికారులు GMR సంస్థకు అప్పగించారు .అయితే భోగాపురం ఎయిర్ పోర్ట్ కు 2015 లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించినప్పటికీ తొమ్మిదేళ్లుగా అడ్డంకులు ఎదురవడంతో ప్రాజెక్టు ఆగిపోయింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కొత్త దిశ‌ను నిర్దేశించ‌నుంది. ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా ల‌క్షలాది ఉద్యోగాల క‌ల్పన‌తో పాటు.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక‌, ప‌ర్యాట‌క రంగాల వృద్ధికి ఊత‌మిస్తుంది.

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదం చేయనుంది. 2,203 ఎక‌రాల్లో నిర్మింస్తున్న ఈ విమానాశ్రయం తొలిద‌శ పనులను 4,592 కోట్ల రూపాయల వ్యయంతో చేప‌ట్టనున్నారు. ప‌నులు ప్రారంభించిన నాటి నుంచి గ‌రిష్టంగా మూడేళ్ల వ్యవ‌ధిలో నిర్మాణాన్ని పూర్తిచేసి ఎయిర్‌పోర్టు కార్యక‌లాపాల‌ను నిర్వహించనున్నారు. అయితే ప‌బ్లిక్ ప్రైవేట్ భాగ‌స్వామ్య విధానంలో జి.ఎం.ఆర్‌. విశాఖ‌ప‌ట్నం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీనిని నిర్మిస్తోంది. తొలిద‌శ‌లో భాగంగా ఏటా 60 ల‌క్షల మంది ప్రయాణీకులు ప్రయాణాలు సాగించేలా రూపొందించింది. ఆ త‌ర్వాత ప్రయాణీకుల ర‌ద్దీకి అనుగుణంగా ప్రతి ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేటట్లు వీలుగా ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories