ఇవాళ వైసీపీ గడప గడపకు కార్యక్రమంపై వర్క్‌షాప్‌

Today workshop on YCP Gadapa Gadapa program
x

ఇవాళ వైసీపీ గడప గడపకు కార్యక్రమంపై వర్క్‌షాప్‌

Highlights

CM Jagan: *గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమానికి విశేష స్పందన

CM Jagan: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.. కార్యక్రమం అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో ఎంతవరకు పోతున్నారని అంశానికి సంబంధించి ఇవాళ సీఎం జగన్ సమీక్షించనున్నారు. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో ఉదయం 10 గంటలకి పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.

గత నెల 11న రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌లకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. కార్యక్రమం ప్రారంభించి దాదాపు నెల రోజులు కావస్తున్నా నేపథ్యంలో కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని అంశానికి సంబంధించి సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నారు.

నెల రోజులుగా జరుగుతున్నటువంటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి సీఎం జగన్ ఓరియంటేషన్ క్లాస్‌ని ఎమ్మెల్యేలు ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా గత నెల రోజులు ఈ కార్యక్రమానికి సంబంధించి ఫీడ్‌ బ్యాక్ సీఎం జగన్ వద్ద ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఫీడ్‌ బ్యాక్ ఉన్న నేపథ్యంలో ఆ నివేదికలోని అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు సీఎం జగన్. ప్రజలకు ప్రభుత్వ పథకాలు చెప్పేందుకు ఎమ్మెల్యేలు ఏ విధంగా పని చేస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కారం దిశగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి సమావేశంలో జగన్ ప్రస్తావించనున్నారు.

ఈ సమావేశంలో కేవలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం గురించే కాకుండా మిగిలిన పొలిటికల్ అంశాల గురించి కూడా సీఎం జగన్ మాట్లాడాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైన నేపథ్యంలో ఒక పక్కా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూడా స్పీడ్ పెంచిన పరిస్థితుల్లో వైసీపీ ఈ రెండేళ్లు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు తిప్పికొట్టాలనే అంశానికి సంబంధించి సీఎం జగన్ పలు సూచనలు చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories