AP Assembly: ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్న సీఎం జగన్‌

Today Is The Second Day Of AP Assembly Meetings
x

AP Assembly: ఇవాళ రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్న సీఎం జగన్‌

Highlights

AP Assembly: వైద్య విధాన పరిషత్‌ రద్దు బిల్లు, ఏపీ ఆధార్‌ బిల్లు

AP Assembly: కాసేపట్లో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్‌ అవర్‌తో శాసనసభ ప్రారంభం కానుండగా.. ముందుగా ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలపనుంది. ఆ తర్వాత బీఏసీ నిర్ణయాలను సభలో ప్రవేశపెట్టనున్నారు సీఎం జగన్‌. అలాగే.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో అవినీతి, తీసుకున్న చర్యలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక.. పీఏసీ, అంచనాల కమిటీ, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీలకు సభ్యులను సీఎం జగన్‌ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇవాళ సభలో మూడు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఏపీ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ బిల్లు-2023, వైద్య విధాన పరిషత్‌ రద్దు బిల్లుతో పాటు ఏపీ ఆధార్‌ బిల్లు-2023కు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories