సీఎం జగన్‌ ను కలిసిన బీజేపీ నేత

సీఎం జగన్‌ ను కలిసిన బీజేపీ నేత
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బీజేపీ నాయకుడు రఘునాథ్ బాబు కలిశారు. తాడేపల్లిలో సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన రఘునాథ్ బాబు జగన్ తో..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని బీజేపీ నాయకుడు, టొబాకో బోర్డు ఛైర్మన్‌ రఘునాథ్ బాబు కలిశారు. తాడేపల్లిలో సీఎం అధికారిక నివాసానికి వెళ్లిన రఘునాథ్ బాబు జగన్ తో అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో పొగాకు కొనుగోళ్ల విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. టొబాకో కొనుగోళ్లలో ప్రభుత్వ చొరవతో రైతులకు మంచి ధర లభించిందని ఈ సందర్బంగా రఘునాధబాబు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

మార్క్‌ ఫెడ్‌ ద్వారా మార్కెటింగ్‌లో జోక్యం చేసుకోవడం వల్ల రైతులు అధిక ధరకు అమ్ముకోగలిగారని, మార్క్‌ఫెడ్‌ జోక్యం వల్ల రైతులకు సుమారు రూ.125 కోట్లు లాభం వచ్చిందని టొబాకో బోర్డు ఛైర్మన్ రఘునాథ్ బాబు అన్నారు‌. కాగా గతేడాది యడ్లపాటి రఘునాథబాబును పొగాకు బోర్లు చైర్మన్‌ గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రఘునాథబాబును చైర్మన్‌ గా నియమిస్తూ కేంద్రపరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మహేందర్‌ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories