తిత్లీ సాయం పెంచుతూ 2019 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు.. ఇప్పటికి అందని సాయం...

Titli Cyclone Victims Didnt get any Help from AP Govt till now | AP Live News
x

తిత్లీ సాయం పెంచుతూ 2019 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు.. ఇప్పటికి అందని సాయం...

Highlights

Titli Cyclone Victims:డెడ్ లైన్ దాటి వీక్ అవుతున్న ప్రయోజనం శూన్యం

Titli Cyclone Victims: తిత్లీ సాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. దానికి తగ్గట్టుగా అధికారులు కూడా 182.60 కోట్లతో ప్రతిపాదనలు పంపారట..కానీ నాలుగు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికి రైతులకు నష్టపరిహారం ముట్టలేదు. తిత్లీ బాధిత రైతులకు అదనపు పరిహారం చెల్లింనపులో మీనమేషాలు లెక్కిస్తున్నారు అధికారులు. ఇదిగో అదిగో అంటూ వారిని ఊరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మార్చి 31 నాటికి డబ్బులు వేస్తామన్నారు.

కాని ఆ డెడ్ లైన్ కూడా దాటి వారం అవుతుంది. ముఖ్యంగా కవిటి, కంచిలి, వజ్రపుకొత్తూరు, సోంపేట ప్రాంతాల్లో కొబ్బరి, జీడి మామిడి పంటలు ఎక్కువగా పాడయ్యాయి. 2018 అక్టోబర్ లో వచ్చిన తిత్లీ తుఫాను బీభత్సవానికి వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అయ్యాయి. మొక్కజొన్న, బొప్పాయి, అరటి పంటలతో పాటు కొబ్బరి, జీడి పంటలు ధ్వంసం అయ్యాయి. ఆనాడు చంద్రబాబునాయుడు కొబ్బరికి 1500, జీడి పంట హెక్టారుకు 30 వేల చొప్పున్న లక్షా 6వేల 7వందల 78 మంది కొబ్బరి రైతులకు 239.74 కోట్ల రూపాయలు చెల్లించారు.

అధికారులు వెంటనే 2019 సెప్టెంబర్ 3న జి.వో నెం 11 ద్వారా 182.60 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది. ఈ అదనపు పరిహారం లబ్దిదారులు 68,037 మంది రైతులకు ఇస్తే సరిపోతుందని అధికారులు నివేదికలు పంపారు. నెల రోజుల్లో పడుతుందని ప్రభుత్వం తెలిపింది. కాని నేటి వరకూ ఒక్క రూపాయి పడలేదు.

పలాస రెవిన్యూ డివిజన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి అప్పలరాజు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మనకు రెవిన్యూ డివిజన్ వచ్చింది మీకు నెల రోజుల్లో మీ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. సీఎం మాట ఇచ్చి పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు రైతులు. కొబ్బరి రైతులు పడుతున్న కష్టాలు చూసైనా ఇప్పటికైనా అధికారులు రైతులకు ఆదుకుంటారని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories