భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్

భక్తుల్లేకుండానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఛైర్మన్
x
Highlights

Tirupati: టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి...

Tirupati: టీటీడీ పాలకమండలి సమావేశం ముగిసింది. అన్నమయ్య భవన్ లో సమావేశం జరిగింది. కరోనా నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. తిరుమల నుంచి సమావేశంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రూ.5.5 కోట్లతో బర్డ్ ఆస్పత్రిలో 50 గదుల నిర్మాణిస్తున్నామని పేర్కొన్నారు. ఒకే గొడుగు కిందకి టీటీడీ ఆధ్వర్యంలోని వేదపాఠశాలు తీసుకోస్తామని చెప్పారు. బర్డ్ ఆస్పత్రి ప్రాంగణంలో చిన్నపిల్లలు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, విశాఖలో రూ.4.95 కోట్లతో శ్రీవారి ఆలయం వద్ద ఘాట్‌ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు.

టీటీడీ ఉద్యోగులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కోరుతామన్నారు. కరోనా బారిన పడిన టీటీడీ ఉద్యోగుల వైద్య ఖర్చులు టీటీడీ భరించాలని పాలకమండలి నిర్ణయించిందన్నారు. తిరుమలలో వ్యర్థ పదార్థాల నిర్వహణకు ఆధునిక పద్ధతుల కోసం టీటీడీ బోర్డు సభ్యురాలు సుధానారాయణమూర్తి రూ.కోటి విరాళం ఇచ్చారని వెల్లడించారు. గో సంరక్షణకు అధికప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని, ప్రతి ఆలయానికి ఒక ఆవు ఇవ్వాలని సమావేశంలో చర్చించినట్టు ఛైర్మన్‌ చెప్పారు. ఆవు ఇచ్చే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాంకుల్లో స్వామి వారి విరాళాల డిపాజిట్‌ విధానాలు మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం

అధిక మాసం సందర్భంగా ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్ 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం

కరోనా ఉధృతి తగ్గితే అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు వెలుపల నిర్వహణ

కరోనా కారణంగా వాహన సేవలు మాడవీధుల్లో నిర్వహించలేని పరిస్థితి

బర్డ్ ఆస్పత్రిలో రూ.5.5కోట్లతో అదనపు గదుల నిర్మాణం: టీటీడీ ఛైర్మన్

చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం


Show Full Article
Print Article
Next Story
More Stories