Tirupati - Rayalacheruvu: ప్రమాదపు అంచున తిరుపతి రాయల చెరువు

Tirupati Rayalacheruvu in Danger Zone With Heavy Rains
x

ప్రమాదపు అంచున తిరుపతి రాయల చెరువు

Highlights

*సిమెంట్‌ బస్తాలతో గండి పూడుస్తున్న అధికారులు *పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్న 200 మంది సిబ్బంది

Tirupati - Rayalacheruvu: తిరుపతి రాయల చెరువు ఇంకా ప్రమాదపు అంచునే ఉంది. మరోవైపు 36 వేల సిమెంట్‌ బస్తాలతో గండి పూడ్చివేత కొనసాగుతుంది. దీనికి సంబంధించి సిమెంట్‌ను టీటీడీ ఉచితంగా అందిస్తోంది. కాగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎస్పీ వెంకట అప్పల నాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎమర్జెన్సీ సేవల కోసం రేణిగుంట విమానాశ్రయంలో మూడు నేవీ హెలికాప్టర్లను రెడీ చేశారు.

నేషనల్‌, స్టేట్‌ డీఆర్ఎఫ్‌ సిబ్బంది చెన్నై ఐఐటీ నిపుణుల ఆధ్వర్యంలో 200 మంది సిబ్బంది పూడ్చివేత పనుల్లో పాల్గొంటున్నారు. ఇక రాయల చెరువు నీటి సామర్థ్యం 0.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం చెరువులో 0.8 టీఎంసీల నీరు ఉంది. దీంతో చెరువు కట్టక్రమంగా దెబ్బతింటుంది. కట్టతెగే ప్రమాదం ఉండటంతో ఇప్పటికే 16 గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇక ఇన్‌ఫ్లో కన్నా అవుట్‌ ఫ్లో అధికంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా నిన్నటితో పోల్చితే ఇన్‌ఫ్లో తగ్గింది. చెరువుకు 2వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories