Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు..పూర్తి వివరాలివే

Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్..10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు..పూర్తి వివరాలివే
x
Highlights

Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్...

Tirumala Vaikunta Ekadasi Darshans Cancelled: తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వ్రుద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐల దర్శనాలు ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నామన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పలు శాఖల ఉన్నతాధికారులతో అడిషనల్ ఈవో సమావేశమై వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ పదిరోజు వైకుంఠ ద్వారా దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి శ్రీవారి సేవకులు, స్కాట్స్ ను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా అడిషనల్ ఈవో చర్చించారు. ఈ 10 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.

జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు చంటిబిడ్డలు, వ్రుద్ధులు, దివ్యాంగులు, ఆర్బీ ఎన్ఆర్ఐ దర్శనాలను రద్దు చేశారు. జనవరి 9 నుంచి 19 వరకు ఆర్జిత సేవలను రద్దు చేశారు. జనవరి 10వ తేదీ స్వర్ణ రథం ఊరేగింపు, 11న చక్రస్నానం ఎస్వీబీసీలో 10 రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి అర్థరాత్రి 12గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ వో శ్రీధర్, సీఈ సత్యనారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories