Tirumala Devotees: తిరుమలకు వెళ్తున్నారా? ఈ తప్పు చేశారో డైరెక్టు జైలుకే

These are the special features of the concluded Tirumala Srivari Brahmotsavam
x

TTD Brahmotsavalu 2024 : ముగిసిన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ..ఇవీ ప్రత్యేకతలు

Highlights

TTD Alert Devotees: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోండి. లేదంటే ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది. దర్శనం, సేవలు, వసతి బుకింగ్ సంబంధించిన పూర్తివివరాలు తెలుసుకున్న తర్వాతే వెళ్లండి.

TTD Alert Devotees: తిరుమలకు వెళ్తున్నారా? శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తే ముందు దర్శనం, సేవలు, వసతి బుకింగ్ కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి. ఎందుకుంటే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్లో టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదిస్తున్నారు. ఫేక్ టికెట్లను భక్తులకు ఇస్తున్నారు. వెరిఫికేషన్ ద్వారా 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవారి లావాదేవీలు జరిగినట్లు టీటీడీ గుర్తించింది. మీరు కూడా మధ్యవర్తుల ద్వారా టికెట్లు తీసుకున్నట్లయితే రిస్కులో పడతారని టీటీడీ విజ్నప్తి చేస్తుంది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నట్లు టీటీడీ గుర్తించింది. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తోంది.

దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లలో ఫేక్ ఐడీ కార్డులతో దర్శనానికి వచ్చే భక్తులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తించి అదుపులోకి తీసుకుంటుంది. కాబట్టి..ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్‌లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరిస్తోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

కాగా అటు తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల దగ్గర ఆగస్టు 16వ తేదీన ఛత్రస్థాపనోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా అర్చక బ్రుందం శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి..ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది. ఏడాదికోసారి జరిగే ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనక పురాణ ప్రాశస్త్యం ఉందని పండితులు తెలిపారు. తిరుమల ఏడుకొండలల్లో ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటిగా కాలు మోపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా శ్రావణశుద్ధ ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం ను ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని వందల ఏండ్లుగా ఇది జరగుతూ వస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories