Tirupati: తిరుమలలో నిండుకుండను తలపిస్తున్న జలాశయాలు...

Tirumala Tirupati all Reservoirs are Filled with Rain Water so No Water Problem in TTD for Next 2 Years | Live News
x

Tirupati: తిరుమలలో నిండుకుండను తలపిస్తున్న జలాశయాలు...

Highlights

Tirupati: ఐదు జలాశయాల్లో 95శాతం మేర చేరిన నీరు.. మరో రెండేళ్లు నీటి కొరత తీరినట్టే...

Tirupati: తిరుమల క్షేత్రం జలకళను సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొండపైన ఉన్న జలాశయాలన్ని నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోగర్భం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార‌, పసుపుధార ఈ ఐదు డ్యామ్‌లలో నీటినిల్వ సామర్థ్యంలో 96 శాతం మేర నీరు చేరింది.

నీటి ప్రవాహం పెరుగడంతో కొంతమేర గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో మరో ఏడాదికి సరిపడా నీటి అవసరాలు తీరిందని ఎస్‌ఈ జగదీష్ రెడ్డి చెబుతున్నారు.

ప్రస్తుతం గోగర్భం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 2వేల 833 లక్షల గ్యాలన్లు నీరు పూర్తిగా నిండిపోయింది. పాపవినాశనం డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 5వేల 240 లక్షల గ్యాలన్లు కాగా పూర్తిగా నిండిపోయింది. ఆకాశగంగా డ్యామ్ సామర్థ్యం 685 లక్షల గ్యాలన్లు, కుమారధార డ్యామ్ పూర్తి నిల్వ సామర్థ్యం 4వేల 259 గ్యాలన్లు, పసుపుధార డ్యామ్ సామర్థ్యం 12వందల 87 గ్యాలన్లు కాగా పూర్తిగా నిండిపోయాయి.

ఇటీవల విస్తారంగా వర్షాలు పడటంతో తిరుమలలోని జలాశయాన్ని తొణికిసలాడుతుండటంతో రానున్న రెండేళ్లకు నీటి కోరత ఏర్పడకపోవచ్చని స్థానికులు, టీటీడీ అధికారులు భావిస్తున్నారు. వరుస వర్షాలతో ఎత్తైన కొండచరియల నుండి ఎగసిఎగసి పడుతున్న జలపాతాలను, నిండుకుండలాంటి జలాశయాలను తిలకించడానికి భక్తులు, స్థానికులు వస్తున్నారు. అటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా జలాశయాలను సందర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories