Tirumala Temple : కరోనా నుంచి కోలుకొని తిరిగి శ్రీవారి సేవలో ఆలయ జీయంగార్లు..

Tirumala Temple : కరోనా నుంచి కోలుకొని తిరిగి శ్రీవారి సేవలో ఆలయ జీయంగార్లు..
x

tirumala temple (File Photo)

Highlights

Tirumala Temple : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి.. అందులో భాగంగానే తిరుమల

Tirumala Temple : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయి.. అందులో భాగంగానే తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్లు కూడా కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా వారు కరోనా నుంచి కోలుకొని కోలుకున్నారు.. ఈ రోజు జరిగిన శ్రీవారి అభిషేక సేవకు వారు హాజరయ్యారు. అటు ఆలయ అర్చకులు కూడా కరోనాను జయించడం టీటీడీకి శుభపరిణామంగా చెప్పుకోవచ్చు.. తిరుమల శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్లకి కరోనా సోకడంతో వారిని చెన్నైకి తరలించి అక్కడ వైద్యం అందించారు. అక్కడ వైద్యం పొందిన వారు తిరిగి కోలుకున్నారు. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చుకులు.. మరో అర్చుకులు కరోనాతో కన్నుమూశారు.. ఇక చాలా మంది టీటీడీ సభ్యులు కరోనా బారిన పడ్డారు.

అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. గురువారం నాటికి ఉన్న సమాచారం ప్రకారం .. గడిచిన 24 గంటల్లో 9,393 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,551 శాంపిల్స్‌ని పరీక్షించగా 9,393 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 8,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,35,218 కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 87,177 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 55,551 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకు మొత్తంగా 30,74,847 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories