Tirupati Laddu: కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

Tirumala Laddu Controversy TTD EO Shyamala Rao to Submit Report With Chandrababu
x

Tirupati Laddu: కల్తీ నెయ్యి వివాదం.. టీటీడీ ఈవో నివేదికపై సర్వత్రా ఉత్కంఠ

Highlights

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విష‍యంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై ఇవాళ ప్రభుత్వానికి నివేదిక అందనుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి విష‍యంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆలయ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది. ఇవాళ నివేదిక అందిన అనంతరం.. తదుపరి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కార్‌.

మరోవైపు ఆలయ పవిత్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆలయశుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌ పెద్దలతో సమావేశాం కావాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వారి సూచనలతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

లడ్డూ నెయ్యి వివాదంపై ఇప్పటికే స్పందించిన టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి క్వాలిటీపై ఎప్పటి నుంచో ఫిర్యాదులొస్తున్నాయన్నారు. లడ్డూ పోటులో నెయ్యి క్వాలిటీపైనా ఎంక్వైరీ చేశానన్నారు. అనుమానాలు రావడంతో ల్యాబ్‌కు పంపించామన్నారు టీటీడీ ఈవో. అయితే.. కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం ఓ కట్టుకథ అని కౌంటర్‌ ఇచ్చారు వైఎస్ జగన్. కల్తీకి ఆస్కారం లేకుండా టీటీడీలో అద్భుతమైన వ్యవస్థ ఉందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories