Tirumala Brahmotsavalu: నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...

Tirumala Brahmotsavala 2024 today is the initiation of Brahmotsavam today
x

 Tirumala Brahmotsavalu: నేడు తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...

Highlights

Tirumala Brahmotsavalu: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరగనుది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తుంటారు.

Tirumala Brahmotsavalu: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు శాస్త్రోక్తంగా అకురార్పణం జరగనుంది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైంది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తుంటారు.

ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోల్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం పుట్టమన్నులో నవధాన్యాలు నాటుతారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్బచాప, తాడును టీటీడీ అటవీశాఖ కార్యాలయం నుంచి బుధవారం డీఎఫ్ వో శ్రీ శ్రీనివాసులు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. తర్వాత శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప, తాడును ఉంచారు. ఈనెల 4వ తేదీన జరిగే ధ్వజారోహణం కార్యక్రమంలో వీటిని ఉపయోగించనున్నారు.

ఇక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తుంటారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్బ చాపను ధ్వజస్తంభం చుట్టు చుట్టి, దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభం వరకు ఉంచుతారు. వీటిని తయారీ కోసం టీటీడీ అటవీశాఖ పదిరోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలోని శివదర్భ, విష్ణుదర్బ అనే రెండు రకాలు ఉంటాయి. తిరుమలలో విష్ణు దర్బను ఉపయోగిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories