Vijayawada: పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురిని అరెస్ట్‌

Three People Were Arrested In The Paper Leakage Case
x

Vijayawada: పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురిని అరెస్ట్‌

Highlights

Vijayawada: ఇన్విజిలేటర్‌ ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Vijayawada: కోర్టు పరీక్షల పేపర్‌ లీకేజీ కేసులో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న పరీక్షల్లో టెలిగ్రామ్‌ యాప్‌ ద్వారా ప్రశ్నలు పంపి జవాబులు తెలుసుకునేలా ఓ అభ్యర్థి ప్లాన్‌ చేశాడు. ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బాపట్లలో ఉన్న తన అన్న వరుణ్‌కు అభ్యర్థి మనీష్‌కుమార్‌ పంపాడు. వరుణ్‌ నుంచి నరసరావుపేటలోని నాగరాజుకు ఈ ప్రశ్నాపత్రం చేరింది. పరీక్షకు హాజరైన అభ్యర్థి మనీష్‌కుమార్‌కు వరుణ్‌, నాగరాజు నుంచి సమాధానాలు అందేలా ప్లాన్‌ చేశారు. అయితే పేపర్‌ లీకేజీ విషయాన్ని మచిలీపట్నం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు సమాచారం అందించారు ఇన్విజిలేటర్‌. ఫిర్యాదు వచ్చిన వెంటనే దర్యాప్తు చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరీక్షా కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories