ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభం
x
Highlights

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు గానూ ఏపీ ప్ర‌భుత్వం ఉచిత రేష‌న్ స‌రుక‌ల పంపిణీ చేప‌ట్టింది. ఇప్పటికే...

క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న పేద‌ల‌ను ఆదుకునేందుకు గానూ ఏపీ ప్ర‌భుత్వం ఉచిత రేష‌న్ స‌రుక‌ల పంపిణీ చేప‌ట్టింది. ఇప్పటికే రెండో విడతలుగా రేషన్ పంపిణీ చేయగా.. ఇవాళ మూడోవిడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా బియ్యంకార్డు వున్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ధిచేకూరనుంది.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్ వర్తింపజేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూతనిస్తోంది సర్కార్. బియ్యంకార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు అందజేస్తున్నారు. కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి చేశారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు ఉంచారు. సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories