SP Jagadeesh: రథంకు నిప్పు పెట్టిన ఘటనలో ఎలాంటి కుల,మత విభేదాల్లేవు

There was no caste and religious differences in the incident of setting the chariot on fire
x

SP Jagadeesh: రథంకు నిప్పు పెట్టిన ఘటనలో ఎలాంటి కుల,మత విభేదాల్లేవు

Highlights

SP Jagadeesh: హనకనహాల్‌ రామాలయంలో రథానికి నిప్పుపెట్టిన దుండగులు

SP Jagadeesh: అనంతపురం జిల్లా రథం దగ్ధం కేసులో విచారణ కొనసాగుతోంది. హనకనహాల్‌ రామాలయంలో దుండగులు రథానికి నిప్పుపెట్టగా.... ఈ ఘటనలో రథం సగానికి పైగా దగ్ధమయ్యింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాముడి రథాన్ని తగలబెట్టిన హనకనహళ్ గ్రామాన్ని కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్‌ సందర్శించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిస్తితులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై గ్రామస్తులతో చర్చించిన కలెక్టర్... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ తప్ప ఇతర కారణాలు కనిపించడం లేదని తెలిపారు.

ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జగదీష్‌... విచారణ ముమ్మరం చేశామని తెలిపారు. ఉదయం నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. రథంకు నిప్పు పెట్టిన ఘటనలో మతాలు, కులాలు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య వివాదం దీనికి కారణం అని తెలుస్తుందని చెప్పారు. ఘటనపై త్వరలోనే నివేదిక సమర్పిస్తామన్నారు ఎస్పీ జగదీష్.

Show Full Article
Print Article
Next Story
More Stories