AP News: ఎన్నికల వేళ ఎరుపెక్కుతున్న ఏపీ.. ఘర్షణలతో పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం

There is tension in many places in AP
x

AP News: ఎన్నికల వేళ ఎరుపెక్కుతున్న ఏపీ.. ఘర్షణలతో పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం

Highlights

AP News: ఎన్నికల వేళ ఎరుపెక్కుతున్న ఏపీ.. ఘర్షణలతో పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం

AP News: ఎన్నికల వేళ ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తి.. కొట్లాటలకు దిగుతున్నారు. రాళ్లు, కత్తులతో దాడులు చేసుకుంటున్నారు. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఘర్షణలతో సాధారణ ఓటర్లు భయభ్రాంతులకు గురి అవుతున్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ- వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని వైసీపీ ఆరోపణతో గొడవ జరిగింది. పరస్పర దాడుల్లో నవీన్ అనే వ్యక్తికి రక్త గాయాలు అయ్యాయి.

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం కొత్తపల్లిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రోడ్లపై వచ్చి కొట్టుకున్నారు. ఈ కొట్లాటలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రకాశం జిల్లా దర్శిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బట్లపాలెంలో వైసీపీ- టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కార్యకర్తలు రాళ్లు, కర్రలతో కొట్టుకున్నారు. దాడిలో 10 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలింగ్ కేంద్రంలోనూ ఓటర్ల మధ్య తోపులాట జరిగింది. పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేదంటున్న కలెక్టర్, ఎన్నికల అధికారి ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు బాధ్యులపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశం.

Show Full Article
Print Article
Next Story
More Stories