CM Jagan: దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపు.. అర్చకుల గౌరవ వేతనం పెంపు

The Retirement Age Of Temple Employees Increased To 62 In Andhra Pradesh
x

CM Jagan: దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపు.. అర్చకుల గౌరవ వేతనం పెంపు

Highlights

CM Jagan: రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించే అవకాశం

CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఏపి క్యాబినెట్ భేటీ జరగనుంది. సచివాలయం మొదటి బ్లాక్ లో 11 గంటలకి సీఎం జగన్ అధ్యక్షతన జరిగే భేటీలో పలు కీలకమైన అంశాలపై చర్చించి సముచిత నిర్ణయం తీసుకోననున్నారు. ఆగస్టులో ఆమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులతో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా చర్చించే అవకాశం వుంది.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు, పెరుగుతున్న ధరలపై కూడా మంత్రి వర్గ సమావేశం లో చర్చించనున్నారు, ఇక అర్చకుల గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపుపై మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. అలాగే DSC నోటిఫికేషన్, గ్రూప్1,2 ఉద్యోగాల భర్తీకి సంబంధంచి కేబినెట్ కీలక ప్రకటన చేయనుంది. అలాగే రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధంచి మంత్రి వర్గం చర్చించనుంది. అదేవిధంగాపలు సంస్థలకు భూముల కేటయింపుపై చర్చించి మంత్రి వర్గ సమావేశంలో సముచిత నిర్ణయం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories