కలియుగ వైకుంఠంలో పెరిగిపోతున్న భక్తుల సంఖ్య

The Number of Devotees is Increasing in Kaliyuga Vaikuntha
x

కలియుగ వైకుంఠంలో పెరిగిపోతున్న భక్తుల సంఖ్య

Highlights

*శ్రీవారి దర్శనాలకు, ఆగమ శాస్త్రానికి అనుబంధం

Tirumala: శ్రీ లక్ష్మీ దేవిని వెత్తుకుంటూ..భువిపైకి చేరుకున్న శ్రీమహా విష్ణువు, శ్రీ వెంకటేశ్వరునిగా ఏడుకొండల్లో స్వయంగా వెలిసాడు. స్వామి వారి స్వయం వ్యక్తమై వెలసిన అనంతరం స్వామి వారి చుట్టూ ఆలయం నిర్మాణం జరిగిందని పురాణాలూ చెబుతున్నాయి. శ్రీ భగవత్ వైఖానస మహర్షికి శ్రీవారు సాక్ష్యాత్కరించి..ఆగమ శాస్త్రం చెప్పారని, వైఖానస మహర్షి ఆగమ శాస్త్రాన్ని వివరించినట్టు తెలుస్తోంది. ఇప్పటికి శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారమే కైంకర్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు లక్షకు మేర భక్తులు దర్శనానికి వస్తుంటారు. దశాబ్దాలు మారుతున్నా కొద్ది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగిపోతోంది. దీంతో భక్తులు క్యూలైన్ విధానంలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూకాంప్లెక్స్‌ల్లో సైతం టీటీడీ అన్ని సదుపాయాలు చేస్తున్నప్పటీ..భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనబడటం లేదు. దీంతో ఎన్నో ప్రతిపాదనలు తెరపైకి వచ్చినా ఆచరణకు నోచుకోలేదు ఇందు కు ప్రధాన కారణం ఆగమ శ్రాస్త్ర నియామాలే.

శ్రీవారి ఆలయాల్లో జరగాల్సిన పూజలు కైంకర్యల్లో అవలంభిచాల్సిన నియమాలు అగమ శాస్త్రం ప్రకారం నిర్వహించాల్సిందే. ఇందుకు ఆగమ సలహా మండలి, మిరాశీ అర్చకులు, పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఏకాంగులు ఉంటారు. నిత్య, వార, పక్ష, మాస, సాలకట్ల ఉత్సవాలను జీయర్ స్వాములు, ఆగమ సలహా మండలి ప్రకారమే నిర్వహించాలి. గర్భాలయంలో ఎలాంటి మార్పలు చేయకూడదనే నిబంధలనలు ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొవటానికి ఎస్కలేటర్, సంపంగి ప్రకారంపై ఇత్తడి నిచ్చెన చేయించి వెలుపలికి వెళ్లే భక్తులకు వీలుగా ఏర్పాటు చేయాలని భావించారు. ఇదంతా ఆగమ శాస్త్రానికి విరుద్దమని తేల్చారు. దీంతో అప్పట్లో ఈ నిర్ణయానికి ముగింపు పలికారు. దీంతో ఆ నిర్ణయం మరుగున పడింది. ప్రస్తుతం ఆలయంలోకి రావాలన్నా..వెలుపలికి వెళ్లాలన్నా ఒకే మార్గం ఉంది. దీంతో తిరులమకు లక్ష మందికి పైగా భక్తులు చేరుకుంటుంటే..80నుంచి 90వేల మంది భక్తులకే దర్శనం చేయించగలిగే వీలు ఉంటుంది.

ప్రణాళిక బద్దంగా తిరుమలకు చేరుకున్న భక్తులకు ఎలాంటి సమస్య ఎదురవ్వదు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర అడ్వాన్స్ బుకింగ్ దర్శనాలు పొంది, దానితో పాటుగా, వసతి గదులు ముందుగా నమోదు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. టైం స్లాట్ ప్రకారం ఆలయంలోనికి వెళ్లిన అనంతరం 2 గంటలలోపే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుంది. ఎలాంటి ప్రణాలికలు లేకుంటే, సాధారణ సమయాలలో 8 నుంచి పది గంటలు, ఇక రద్దీ వారాంతాల్లో 24 నుంచి 48 గంటలు శ్రీవారి దర్శనానికి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories