Somireddy: సాగునీటి రంగాన్ని స‌ర్వనాశ‌నం చేశారు.. లక్ష ఎకరాలకి 35 టీఎంసీల నీరు దోపిడీ

The Irrigation Sector Was Destroyed  Says Chandramohan Reddy Somireddy
x

Somireddy: సాగునీటి రంగాన్ని స‌ర్వనాశ‌నం చేశారు.. లక్ష ఎకరాలకి 35 టీఎంసీల నీరు దోపిడీ

Highlights

Somireddy: జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు

Somireddy: నెల్లూరు జిల్లాలో ప్రకృతి స‌హ‌జ‌సిద్ధమైన చెరువుల‌ను, కొండ‌ల‌తో పాటు ఆఖ‌రికి జ‌లవనరులను సైతం వైసీపీ ప్రజాప్రతినిధులు కొల్లకొడుతున్నార‌ని తెలుగుదేశంపార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో వ్యవసాయం, నీటిపారుదల శాఖలు అదుపు తప్పాయ‌ని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. నీటి వనరుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు, జిల్లా మంత్రి కాకాణి నీటిపారుదల వ్యవస్థ ను స‌ర్వనాశ‌నం చేశార‌న్నారు. లక్ష ఎకరాలకి 35 టీయంసీల‌ నీటిని వైసీపీ ప్రభుత్వం గల్లంతు చేసింద‌న్నారు. టిడిపి హయాంలో నీరు లేకపోయినప్పటికి పై ప్రాంతాల నుండి నీరు తెప్పించి రైతుల అవసరాలను తీర్చామ‌ని గుర్తుచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories