The Hans India: విశాఖ హ్యాన్స్ ఇండియా ఆఫీసులో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Hans India Celebrates 12th Anniversary in Vizag
x

The Hans India: విశాఖ హ్యాన్స్ ఇండియా ఆఫీసులో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Highlights

The Hans India: ప్రజా సమస్యలను సైతం గలమెత్తి చాటి చెప్తున్న పత్రిక హాన్స్ ఇండియా అని విశాఖ gvmc కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు.

The Hans India: ప్రజా సమస్యలను సైతం గలమెత్తి చాటి చెప్తున్న పత్రిక హాన్స్ ఇండియా అని విశాఖ gvmc కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. హ్యాన్స్‌ ఇండియా పత్రిక 12వ వార్షికోత్సం జరుపుకుంటున్న తరుణంలో సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హాన్స్ ఇండియా, HMTV విశాఖ కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు gvmc, కమిషనర్ సాయి కాంత్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్‌లో తెలంగాణ, ఏపీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని హాన్స్ ఇండియా పేపర్ చూసి తెలుసుకునే వాడినని కమిషనర్‌ సాయికాంత్ వర్మ అన్నారు. అనంతరం కేక్‌ కట్ చేసి హ్యాన్స్ ఇండియా పుష్కర కాల వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమంలో హాన్స్ ఇండియా బ్యూరో చీఫ్ రాణి దేవెళ్ళ, ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వాసు పొత్నురు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ ప్రతినిధులు కే.వి.ఏం ప్రసాద్, రమేష్, సేక్యులేశన్ డిపార్ట్మెంట్ బివిఆర్ శాస్త్రి, hmtv వైజాగ్ బ్యూరో అనురాధతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories