Andhra Pradesh: సినిమా టికెట్ల ధరల వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధం

The Government is Preparing to Open a Dispute Over Movie Ticket Prices
x

Andhra Pradesh: సినిమా టికెట్ల ధరల వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధం

Highlights

Andhra Pradesh: ఇవాళ సచివాలయంలో సమావేశం కానున్న టికెట్ల కమిటీ.

Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కొలిక్కిరానున్నది. టికెట్ల ఇష్యూపై చర్చించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో సమావేశం కానున్నది. ఈ సమావేశంలో టికెట్ల డ్రాఫ్ట్‌ రికమండేషన్‌లపై చర్చించనున్నారు. ఇప్పుడున్న 3 క్లాసులకు బదులుగా రెండింటినే తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం.

సినిమా టికెట్ల ధరల వివాదానికి తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇటీవల సీఎం జగన్‌తో సినిమా పెద్దలు భేటీ అయిన తర్వాత టికెట్ల కమిటీ కూర్చొని చర్చించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే డ్రాఫ్ట్‌ రికమండేషన్లు సిద్ధమైనట్లుగా తెలుస్తున్నది. భౌగోళిక క్యాటగిరిలో 35 జీవో ప్రకారం 4 ప్రాంతాలను 3గా మార్చారు. గ్రామ, నగర పంచాయతీలను కలిపి నగర పంచాయతీ ఏరియాగా చేసిన సిఫార్సులపై ఇవాళ చర్చించనున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో టికెట్‌ క్లాసుల్లోనూ సవరణలకు సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

అన్ని థియేటర్లలో ఎకానమీ, ప్రీమియం క్లాసులనే సిఫార్సు చేసినట్లుగా సమాచారం. ఇదే గనక అమల్లోకి వస్తే రానున్న రోజుల్లో డీలెక్స్ క్యాటగిరి కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తున్నది. మొత్తం సీట్లలో 40 శాతం సీట్లు ఎకానమీ క్లాసుకు కేటాయించి మిగతా సీట్లను ప్రీమియం క్యాటగిరీ కింద పెట్టాలని భావిస్తున్నారు. మరోవైపు సినిమా థియేటర్ల టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories