Visakhapatnam: విశాఖ జిల్లా గాజువాకలో టెన్షన్... టెన్షన్.. చలో గంగవరం పోర్టుకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

The Gangavaram Port Workers Protest Has Reached Its 44Th Day
x

Visakhapatnam: విశాఖ జిల్లా గాజువాకలో టెన్షన్... టెన్షన్.. చలో గంగవరం పోర్టుకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

Highlights

Visakhapatnam: పలువురు కార్మికులను అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం

Visakhapatnam: విశాఖ జిల్లా గాజువాకలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. గంగవరం పోర్టు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షలు 44వ రోజుకు చేరుకున్నాయి. దీంతో.. పోర్టు యూనియన్‌, కార్మిక సంఘాలు చలో గంగవరం పోర్టుకు పిలుపునిచ్చాయి. కనీస వేతనం 36 వేల రూపాయలు అమలు చేయాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. నిరసనకు దిగారు. గంగవరం పోర్టు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కార్మికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గంగవరం పోర్టు వద్ద భారీగా మోహరించారు. గంగవరం పోర్టు గేట్‌ కాకుండా.. 100 మీటర్లలో అదనంగా మరో గేట్‌ను ఏర్పాటు చేశారు. కార్మికులు పోర్ట్‌ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories