Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం లో దోషులకు శిక్ష పడాలి

The culprit in the Tirumala Laddu controversy should be punished says Pawan Kalyan
x

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం లో దోషులకు శిక్ష పడాలి

Highlights

Pawan Kalyan: లడ్డూ కల్తీ జరుగుతుంటే గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏం చేసింది..?

Pawan Kalyan: తిరుమల లడ్డూ కల్తీ జరుగుతుంటే.. గత ఐదేళ్లు టీటీడీ బోర్డు ఏం చేసిందని ప్రశ్నించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. లడ్డూ అపవిత్రం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారని ఫైర్‌ అయ్యారు. కోట్లమంది స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, లడ్డూ వివాదంపై కేబినెట్‌ భేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.

అలాగే.. సీబీఐ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని కోరారు పవన్. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై ఆయన ప్రాయశ్చిత్త దీక్షకు పూనారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీదశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవన్ దీక్ష చేపట్టారు. నేటి నుంచి 11రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగనుంది. దీక్ష ముగిసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు పవన్.

Show Full Article
Print Article
Next Story
More Stories