YCP Party: వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు.. అధినేత మరోసారి సీటు ఇస్తారా లేదా అనే ఆందోళన

Tension In The YCP Party
x

YCP Party: వైసీపీ ఎమ్మెల్యేల్లో గుబులు.. అధినేత మరోసారి సీటు ఇస్తారా లేదా అనే ఆందోళన

Highlights

YCP Party: పశ్చిమ, సెంట్రల్ లో సీట్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరు..?

YCP Party: వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అనే ఆందోళన నెలకొంది. ఇప్పటికే 11స్థానాల్లో ఇంఛార్జులను మార్చారు పార్టీ అధినేత జగన్. మరికొంతమంది ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు పిలుపించుకుని మంతనాలు జరుగుతున్నారు. దీంతో ఈసారి ఎంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ దక్కుంది. ఎంతమందిపై వేటు పడబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. అదే సీటు కేటాయిస్తారా లేక వేరే నియోజకవర్గానికి పంపుతారా లేదా పూర్తిగా పక్కన పెడతారా అనే టెన్షన్ పట్టుకుంది. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలోని మూడు అసెంబ్లీ సీట్లలో సిట్టింగ్లకు భయం పట్టుకుంటే.. ఆశావాహులకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది జగన్ నిర్ణయం.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపి ఎమ్మెల్యేలుగా ఉన్న వెల్లంపల్లి, మల్లాది విష్ణులకు ఈసారి టిక్కెట్ కష్టమే అనే టాక్ బలంగా వినిపిస్తుంది. వీరి స్థానంలో వేరే అభ్యర్థులను పెడుతున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే వెల్లంపల్లి ,మల్లాది విష్ణులకు వేరే నియోజవర్గాలు కేటాయిస్తారా లేక మొత్తానికే పక్కన పెడతారా అనే అంశంపై వైసిపి క్యాడర్లో చర్చ మొదలైంది. తూర్పు నియోజకవర్గ టికెట్ అవినాష్‌కు పక్కా అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి సొంత పార్టీ కేడర్ నుంచే వ్యతిరేకత వస్తోంది. మంత్రిగా పని చేసిన సమయంలో వెల్లంపల్లిపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని టాక్. ప్రస్తుతం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆసీఫ్ మొదటి నుంచి పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెల్లంపల్లికి సీట్ ఇచ్చిన జగన్.. తొలి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఐతే వెల్లంపల్లి పార్టీ కేడర్‌ను కలుపుకుని వెళ్లడంలో విఫలం అయ్యారనే విమర్శ ఉంది. ఒక వర్గం వారికే పెద్ద పీట వేశారనే ఆరోపణలు వచ్చాయి.

మంత్రివర్గ పునర్విభజనలో వెల్లంపల్లి స్థానంలో తాడేపల్లిగూడెం చెందిన ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు జగన్. నాటినుండి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఇంద్రకీలాద్రిపై ఆధిపత్యం కోసం ఇటు వెల్లంపల్లి అటు కొట్టు సత్యనారాయణ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పశ్చిమ నియోజకవర్గంపై వెల్లంపల్లి పట్టు నిలుపుకోవడం కోసం, పశ్చిమ సీటు తనదే అని చెప్పుకోవడం కోసం శతవిధాల కృషి చేస్తున్నాడు.

తన పుట్టినరోజుని గ్రాండ్‌గా ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలతో సీటు తనదే అనిపించుకున్నాడు. కానీ నియోజకవర్గం నేతలలో వ్యతిరేకత, కొట్టు సత్యనారాయణ తో వైరం, సామినేని ఉదయభానుతో గొడవలు పశ్చిమ సీటును దూరం చేస్తున్నాయి అనేది వైసిపి నేతల్లో టాక్.

అందుకే పశ్చిమ నియోజకవర్గం సీట్ ని పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్న మైనార్టీ వర్గానికి చెందిన ఆసిఫ్ కి కేటాయిస్తారని చర్చ జరుగుతుంది. మరోపక్క పశ్చిమ నియోజకవర్గం కోసం విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఇక సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతుంటే ఈ స్థానంలో కూడా మార్పు అనివార్యంగా తెలుస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి మల్లాదిని తప్పించి ఆస్థానంలో ప్రస్తుతం కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న ఆడపా శేషుకి ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

సెంట్రల్ నియోజకవర్గంలో సీటు కోసం ఆడపా శేషు ఇప్పటికే పైరవీలు ప్రారంభించారని, సజ్జల లాంటి వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గం సీటు తనకే వచ్చే విధంగా చూస్తానని అధినాయకుడితో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరొకపక్క ఇదే స్థానం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీ స్టేట్ అడిషనల్ సెక్రటరీగా ఉన్న తోట శ్రీనివాసులు టిక్కెట్లు ఆశిస్తున్నారు.

విజయవాడ కార్పొరేషన్ లో ఉన్న మూడు నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేయనున్నట్టు వైసిపి వర్గాల్లో చర్చ ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో తమ స్థానాలు నిలుపుకోవడం కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అయితే తూర్పు నియోజకవర్గ సీటు అభ్యర్థిగా అవినాష్ ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో మిగతా రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా మార్పు ఉంటుందని అంతా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories