పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్

Tension In Palnadu District
x

పల్నాడు జిల్లాలో టెన్షన్.. టెన్షన్.. మాచర్లలో కొనసాగుతున్న 144 సెక్షన్

Highlights

* మాచర్లకు వచ్చే దారిలో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు.. మాచర్లకు ఇతరులను రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు

Palnadu: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన దాడులు రణరంగాన్ని తలపించాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో మాచర్ల పట్టణంలో నిన్న సాయంత్రం నుంచి ఉద్రిక్తత కొనసాగుతోంది. దాడులు, మంటలతో జనం భయంతో వణికిపోయారు. సాయంత్రం ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మొదలైన ఘర్షణ కాస్త రాళ్లు, కర్రలతో దాడులు చేసుకుని రాత్రికి రణరణంగా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇల్లుతో పాటు టీడీపీ పార్టీ కార్యాలయం, నేతల వాహనాలు దగ్ధమయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ విధ్వంసం ఎక్కడి వరకు దారితీస్తుందోనని పట్టణ ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు.

నిన్న సాయంత్రం టీడీపీ నేతలు, మాచర్ల రింగ్ రోడ్ నుంచి మున్సిపల్ ఆఫీసు ఎదుట ఉన్న పాఠశాల వరకు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టారు. దీనికి టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అదే సమయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణ కాస్త కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకున్నా వెంటనే నిలువరించేలేని పరిస్థితి నెలకొంది. ఈ విధ్వంసంలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు.

టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. దీంతో టీడీపీ నేతల ఇళ్ల దగ్గర ముందుజాగ్రత్తగా పోలీసులు మోహరించారు. హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు పల్నాడు వెళ్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. మాచర్ల పట్టణం ఎంట్రెన్స్ లో చెక్ పోస్టును ఏర్పాటు చేసి రాకపోకలపై నిఘా పెట్టారు. బయట నుంచి పట్టణంలోకి ఎవ్వరిని రాకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను సైతం నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories