CPI: నందిగామ పట్టణం లో ఉద్రిక్తం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చెయ్యొద్దు

Tension In Nandigama About Privatization Of Vizag Steel Plant
x

CPI: నందిగామ పట్టణం లో ఉద్రిక్తం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చెయ్యొద్దు

Highlights

CPI: కేంద్రం దుష్ట ఆలోచనను మానుకోవాలి

CPI: నందిగామలో గాంధీ సెంటర్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు సిపిఎం నాయకులు. ఈ విషయంపై ముందే సమాచారం అందుకున్న పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల అక్రమ అరెస్టుకు నిరసనగా కౌలు రెతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, పలు ప్రజాసంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం కార్పోరేట్ సంస్థలకు దోచిపెడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై రాష్ల్ర ప్రభుత్వం గానీ, ప్రతిపక్షపార్టీలుగానీ స్పందించడం లేదని మండిపడ్డారు. కేంద్రం దుష్ట ఆలోచనను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories