కేసీఆర్ మరో ప్రకటన చేయాల్సిందే: పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి

కేసీఆర్ మరో ప్రకటన చేయాల్సిందే: పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి
x
ఉత్తం కుమార్ రెడ్డి
Highlights

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ సీఏఏను వెంటనే ఉప సంహరించుకోవాలని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన చేపట్టారు. అనంతరం హైదరాబాద్‌లోని ప్రధాన మార్గాల వెంట భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పెట్టుబడులు రాకపోవడం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. ఈ అన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఏఏ, ఎన్ఆర్‌సీ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు.

కేవలం పార్లమెంటులో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం మాత్రమే కాదని, తెలంగాణలో సీఏఏ అమలు చేయబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ నుంచి ''తెలంగాణలో 'సేవ్ కాన్‌స్టిట్యూషన్.. సేవ్ ఇండియా' అనే నినాదంతో శాంతియుత పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు. ఈ ర్యాలి కోసం ప్రభుత్వం అనుమతిని ఇవ్వాలని కోరారు. ర్యాలీ నిర్వహించడానికి ఎంఐఎం కు కూడా పోలీసులు అనుమతిచ్చారని తెలిపారు.

అనంతరం మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు గీతా రెడ్డి మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం అవసరం దేశంలో ఏముందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పక్కనే పెట్టేసి, కేంద్ర ప్రభుత్వం సొంత నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. దేశంలో అన్ని జాతులు, మతాలు కలిసి మెలసి ఉండాలని రాజ్యాంగ పీఠికలోనే ఉందని గుర్తు చేశారు. అసోంలో ఉన్న ఎన్ఆర్‌సీ సమస్యను దేశ వ్యాప్తంగా రుద్దడం సరి కాదని ఆమె అన్నారు. ఇప్పటి వరకూ ఈ చట్టం అమలు చేయడం వలన దేశమంతా చెలరేగుతున్న ఆందోళనల్లో ఎంతో మంది పోలీసులు, పౌరులు, చనిపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories