Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన బాట

Teachers Protest with Black Badges in Andhra Pradesh | AP News Today
x

 ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆందోళన బాట

Highlights

Andhra Pradesh: నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

Andhra Pradesh: పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. విజయవాడలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు.. కొత్త పీఆర్సీ వల్ల తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఆర్‌ఏ కనీస శ్లాబు 12శాతానికి పైగా ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. దశలవారీ పోరాటాలకు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునివ్వడంతో వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు.

మరోవైపు కలెక్టరేట్ల వద్ద నిరసనలకు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల కాంట్రాక్టు ఉద్యోగ నాయకులను గృహనిర్బంధం చేశారు. నాయకుల గృహనిర్బంధాలను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఖండించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories