టీడీపీకి ఛాలెంజ్‌గా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ.. కీలక నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని జనసేన డిమాండ్

TDP to Face Challenges Over Nominated Posts
x

టీడీపీకి ఛాలెంజ్‌గా మారిన నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ.. కీలక నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని జనసేన డిమాండ్

Highlights

AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ టీడీపీకి ఛాలెంజ్‌గా మారింది.

AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ టీడీపీకి ఛాలెంజ్‌గా మారింది. భారీగా ఆశావాహులు ఉండటంతో కత్తిమీద సాములా మారింది పోస్టుల భర్తీ పక్రియ. మంత్రి పదవులు రాకపోవడంతో నామినేటెడ్ పదవుల కోసం సీనియర్లు పట్టుబడుతున్నారు. కీలక నామినేటెడ్ పోస్ట్‌లు కావాలని జనసేన డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక TTD, APSRTC, APMDC, APIIC, PCB, APDC, SAP ఛైర్మన్ పదవుల కోసం తీవ్రంగా పోటీ నెలకొంది. దుర్గగుడి ఛైర్మన్, ఆప్కాబ్, మార్క్ ఫెడ్ పదవుల కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని సీనియర్లు కోరుతున్నారు.

TTD బోర్డు మెంబర్స్‌గా తెలంగాణ నుంచి ఇద్దరు నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. కేబినెట్ హోదా ఉన్న పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. సామాజిక సమీకరణాలతో నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. SVBC ఛైర్మన్‌గా తెలంగాణ నుంచి ఓ అధికార ప్రతినిధికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈసారి నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేయనున్నారు. సీనియార్టీ, పార్టీకి విధేయులు, యువతకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఇవాళ్టి పొలిట్ బ్యూరోలో నామినేటెడ్ పోస్టులపై తుది నిర్ణయం వెలువరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories