అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్.. మండలిలో నోటీసు..

అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్.. మండలిలో నోటీసు..
x
Highlights

బుధవారం మరోసారి అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని, అంతేకాకుండా వివిధ ప్రజాసమస్యలపై మాట్లాడటానికి సభలో అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. TDP సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు.

బుధవారం మరోసారి అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్ చేసింది. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని, అంతేకాకుండా వివిధ ప్రజాసమస్యలపై మాట్లాడటానికి సభలో అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ.. TDP సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వ తీరు సరిగా లేదన్న విపక్ష నేత చంద్రబాబు అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాగా మంగళవారం గవర్నర్‌ ప్రసంగం సమయంలోను, బడ్జెట్ సమయంలోనూ కూడా టీడీపీ సభ్యులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. రెండ్రోజులు మాత్రమే జరుగుతున్న ప్రస్తుత సెషన్‌లో ఇవాళ బడ్జెట్‌పై టీడీపీ సభ్యులు మాట్లాడాల్సి ఉంది. కానీ.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపిన వికేంద్రీకరణ బిల్లు, CRDA రద్దు బిల్లుపై టీడీపీ ఎమ్మెల్సీలు నోటీసు ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories