Mangalagiri: మంగళగిరిలో మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడించిన టీడీపీ

TDP Leaders at the Office of the Womens Commission in Mangalagiri
x

Mangalagiri: మంగళగిరిలో మహిళా కమిషన్ కార్యాలయం ముట్టడించిన టీడీపీ

Highlights

Mangalagiri: మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు -అనిత

Mangalagiri: మంగళగిరిలోని ఏపీ మహిళా కమిషన్‌ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు తెలుగు మహిళలను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కమిషన్‌ కార్యాలయం వద్ద తెలుగు మహిళలు నిరసనకు దిగారు. విజయవాడ అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని అనిత ప్రశ్నించారు.

మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు తమకు ఉందని చెప్పారు. ఆస్పత్రిలో అత్యాచారం కేసులో తీసుకున్న చర్యలేంటని ఆమె ప్రశ్నించారు. ఇక మహిళా కమిషన్‌ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వాసిరెడ్డి పద్మకు వినతి పత్రం అందజేశారు. విజయవాడతో సహా అన్ని అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో ఊరికో ఉన్మాది' అనే పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories