Independence Day 2020: గాంధీ మళ్లీ పుట్టి ఏపీని కాపాడాలి: అనిత

Independence Day 2020: గాంధీ మళ్లీ పుట్టి ఏపీని కాపాడాలి: అనిత
x
Highlights

Independence Day 2020: 2019 జూన్ నుంచీ స్వతంత్రం కోల్పోయామని.. మరోసారి గాంధీ పుట్టి ఏపీని కాపాడాలి అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి...

Independence Day 2020: 2019 జూన్ నుంచీ స్వతంత్రం కోల్పోయామని.. మరోసారి గాంధీ పుట్టి ఏపీని కాపాడాలి అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.. వంగలపూడి అనిత వ్యాఖ్యలు యధావిధిగా.. 2019 జూన్ నుంచీ స్వతంత్రం కోల్పోయాం, మరోసారి గాంధీ పుట్టి ఏపీని కాపాడాలి. సీఎం జగన్ నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలు, ఏపీలో ఆడపిల్ల అర్ధరాత్రి కాదు కదా, పగలు కూడా బయటకి రాలేని పరిస్ధితి ఉంది. ఆడపిల్లలపై అత్యాచారాలు, అరాచకాలు పెరిగిపోయాయి. అధికారిణి అనితారాణి విషయంలో జరిగిందే ఉదాహరణ. ప్రభుత్వం సోషల్ మీడియా 5 రూపీస్ పేటిఎం బ్యాచ్ తో మాట్లాడిస్తున్నారు.

రాజమండ్రిలో 14 సంవత్సరాల‌ బాలికపై అఘాయిత్యంపై నోరుమెదపని ప్రభుత్వం, మూడు రాజధానుల మాట స్వాతంత్ర్య దినోత్సవంలో మాట్లాడటం సీఎం చేతకానితనం. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం మూడు రాజధానులు అంటోంది. 22 మంది ఎంపీలు ఎప్పుడైనా ప్రత్యేకహోదా గురించి మాట్లాడారా, ఏపీలో దిశ యాక్టుకు అతీగతీ లేదు. దిశ యాక్టు విషయంలో తెలంగాణ సీఎం కు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన సీఎం ఏపీలో ఏం చేస్తున్నారు. కేంద్రం ఆమోదం లేని చట్టమని ఎలా స్పెషల్ అధికారులను, స్టేషన్లను పెట్టారు. టీడీపీ మీద మాట్లాడటానికి మాత్రమే ఏపీ మహిళా కమీషన్ ముందుకొస్తుంది. మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు, దిశ యాక్టు అమలు అవుతుందా లేదా చూడటానికి తప్పులు చేస్తున్నారా అనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా మహిళల రక్షణ పట్టించుకోవాలి, మద్యపాన నిషేధమే చేస్తానంటున్న ప్రభుత్వం, కొత్త బ్రాండ్లు ఎల తెస్తోంది. సంవత్సర కాలంలో మహిళలను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా నిర్విఘ్నంగా పనిచేసారని అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.




Show Full Article
Print Article
Next Story
More Stories