టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తప్పులో కాలేశారా?

టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తప్పులో కాలేశారా?
x
Highlights

టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తప్పులో కాలేశారు. గంజాయి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోయి అబాసుపాలయ్యారు. జగన్ సీఎం అయ్యాక తాడేపల్లి గంజాయికి...

టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ తప్పులో కాలేశారు. గంజాయి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోయి అబాసుపాలయ్యారు. జగన్ సీఎం అయ్యాక తాడేపల్లి గంజాయికి అడ్డాగా మారిందని ఆరోపించారు ఆమె. అందుకు ఉదాహరణ ఓ మహిళే అని ఆరోపించారు. ఈ క్రమంలో తాడేపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కుమారుడు తాగుడుకు బానిసై ఇబ్బందులు పెడుతుంటే పోలీసులకు చెప్పి మార్చాలని వేడుకుంది. ఈ విషయం తెలుసుకున్న అనురాధ ఆమెను పిలిపించుకొని ప్రభుత్వంపై విమర్శలు చెయ్యాలని కోరినట్టు సదరు మహిళ చెప్పారు.

అనురాధ చెప్పినట్టే ఆమె ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అనురాధ కూడా గురువారం మీడియా సమావేశంలో ఈ విషయాన్నీ ప్రస్తావించారు. మీడియా సమావేశం అనంతరం ఆ మహిళ ప్రభుత్వంపై తాను చేసిన విమర్శలకు వివరణ ఇచ్చారు. తాగుడుకు బానిసైన తన కొడుకు గంజాయి కారణంగా ఇబ్బందులు పడుతున్నాడని ప్రభుత్వంపై విమర్శలు చేయమని తనకు టీడీపీ నాయకురాలు అనురాధే చెప్పారని ఆమె చెప్పారు. దీంతో వైసీపీ నేతలు అనురాధపై మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories