Kollu ravindra sent rajahmundry jail : రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

Kollu ravindra sent rajahmundry jail : రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
x
Highlights

Kollu ravindra sent rajahmundry jail : ఆంధ్రప్రదేశ్లో మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది.

Kollu ravindra sent rajahmundry jail : ఆంధ్రప్రదేశ్లో మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.

కృష్ణా జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మార్గమధ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సీతారాంపురం వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పెడన నియోజకవర్గం గూడూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు పూర్తి చేసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు.

మోకా భాస్కర్‌రావును కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

మరోవైపు మోకా భాస్కర్‌రావు హత్య కేసుకు సంబంధించి పోలీసు విచారణలో విస్తుగొలిపే అంశాలు బయపటడుతున్నాయి. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాదనలు విన్న ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

మోకా భాస్కరరావు హత్యలో చింతా చిన్ని, చింతా నాంచారయ్య అలియాస్‌ పులి, చింతా కిషోర్‌ రక్త సంబందీకులు. వీరు వరుసగా మొదటి నిందితులు కాగా నాలుగో నిందితునిగా కొల్లు ఉన్నారు. నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories