జగన్‌కు మంచి క్రేజ్ ఉంది.. అయినా టీడీపీలోకి వెళ్లాం : జేసీ పవన్ రెడ్డి

జగన్‌కు మంచి క్రేజ్ ఉంది.. అయినా టీడీపీలోకి వెళ్లాం : జేసీ పవన్ రెడ్డి
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ పవన్ రెడ్డి . 2014 ఎన్నికలకు ముందు జగన్‌కు మంచి క్రేజ్ ఉందని, 2012 ఉప...

ఆంధ్రప్రదేశ్ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జేసీ పవన్ రెడ్డి . 2014 ఎన్నికలకు ముందు జగన్‌కు మంచి క్రేజ్ ఉందని, 2012 ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీలు వచ్చాయని అయినా.. తన కుంటుంబం వైసీపీలో చేరలేదన్నారు. చంద్రబాబు అయితే విజన్ ఉన్న నాయకుడని తాము భావించామన్నారు జేసీ పవన్ చెప్పుకొచ్చారు. 2014లో తమ కుటుంబం టీడీపీలోకి వెళ్లిన తర్వాత జిల్లాలో పార్టీ మెజార్టీ స్థానాలు వచ్చాయని గుర్తు చేశారు.

రాజకీయాల్లోకి తానూ రావాలని అనుకోలేదన్నారు పవన్ రెడ్డి. గతంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల్ని తమ ఇంటికి వచ్చారని తన తండ్రి దివాకర్‌రెడ్డిని కలిశారన్నారు. తాము మాత్రం పార్టీలోకి రామని చెప్పినట్లు గుర్తు చేశారు. వైఎస్ లక్‌తో ముఖ్యమంత్రి అయ్యారు.. తాను కూడా సమ ఉజ్జీనని.. తాను పార్టీలోకి రానని జేసీ దివాకర్ రెడ్డి వారికి చెప్పినట్లు పవన్ రెడ్డి అన్నారు.

జేసీ కుటుంబంపై కేసులు ఊహించినవే అని పవన్ రెడ్డి అంటున్నారు . ప్రజలకు మంచి పాలన అందించాల్సిందిపోయి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు ఎందుకు అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తమపై ఇంకా కేసులు పెడతారని.. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి అన్నారు. జగన్‌ తన ఫ్రెండ్ అనీ, ఫోన్ చేస్తే ఏముంటుంది తనను పార్టీలో చేరమని అడుగుతారని, తమనకు అవసరం లేదని పవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories