Andhra Pradesh: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం

TDP key Decision on MPTC, ZPTC Elections
x

టీడీపీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: పరిషత్‌ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటన

Andhra Pradesh: పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తర్వాత ఆపార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీలోని సీనియర్‌ నాయకులు వ్యతిరేకించారు. బాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందన్నారు. నిజమైన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరగడం లేదంటూ అసంతృప్తి వెళ్లగక్కారు.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆపార్టీ అధ్యక్షులు చంద్రబాబు ప్రకటించారు. అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని ఎస్‌ఈసీ తీరును తప్పుపడుతూ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై చర్యలు తీసుకోక పోవడాన్ని తప్పుబట్టారు. బలవంతంగా నామినేషన్లు విత్‌ డ్రా చేయించారని చంద్రబాబు ఆరోపించారు.

ఇక పరిషత్‌ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించినందుకు టీడీపీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రు రాజీనామా చేశారు. చంద్రబాబు నిర్ణయం నిరాశకు గురిచేసిందన్న ఆయన.. పార్టీ నిర్ణయంతో విభేదిస్తున్నట్లు ప్రకటించారు. అయితే జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతానని జ్యోతుల నెహ్రు వెల్లడించారు.

మరోవైపు పార్టీ నిర్ణయానికి భిన్నంగా స్పందించారు అశోక్‌ గజపతిరాజు. టీడీపీ అభ్యర్థుల పోటీపై కేడర్‌ అభిప్రాయం తీసుకోవాల్సిందని చెప్పారు. టీడీపీ ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న రాజకీయ పార్టీ అన్న ఆయన పోటీలో గెలిచినా, గెలవకపోయినా సిద్ధాంతాలు వదులుకోకూడదన్నారు. ఇక స్థానిక పరిస్థితులను బట్టి తాను తదుపరి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories