లోకేష్ పాదయాత్రపై టీడీపీలో జరుగుతున్న చర్చేంటి..?.. లోకేష్ యాత్ర కంటే వివేకా కేసుపైనే టీడీపీ ప్రత్యేక దృష్టి..

TDP Eyes on YS Viveka Case Rather Lokeshs Padayatra
x

లోకేష్ పాదయాత్రపై టీడీపీలో జరుగుతున్న చర్చేంటి..?.. లోకేష్ యాత్ర కంటే వివేకా కేసుపైనే టీడీపీ ప్రత్యేక దృష్టి..

Highlights

Lokesh Padayatra: ఏపీలో గడ్డుకాలం ఎదుర్కొన్న టీడీపీ.. తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా ఎత్తులు వేస్తోంది.

Lokesh Padayatra: ఏపీలో గడ్డుకాలం ఎదుర్కొన్న టీడీపీ.. తిరిగి అధికారం చేజిక్కించుకునే దిశగా ఎత్తులు వేస్తోంది. జనాల్లోకి వెళ్లి పట్టు సాధించుకునే ప్రయత్నాల్లో పడింది. అందులో భాగంగానే నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అయితే లోకేష్‌ యాత్ర టీడీపీకి ఎంతమేర విజయానికి బాటలు వేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు టీడీపీలో కూడా ఇదే భావన మొదలైందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. లోకేష్‌ యాత్ర.. టీడీపీకి మైలేజ్‌ ఇవ్వలేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారా..? అందుకే వివేకా హత్యకేసును అస్త్రంగా ఆ పార్టీ మార్చుకుంటోందా..? లోకేష్ యాత్రను జనాలే కాదు.. పార్టీ అధినేత కూడా పట్టించుకోవడం లేదా..? ప్రస్తుతం తెలుగుదేశం నేతలు వివేకా హత్య కేసుపై పెడుతున్న శ్రద్ధ... ఇలాంటి ఎన్నో ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తోంది.

ప్రతిపక్షం అధికారంలోకి రావాలంటే అధికార పక్షంపై వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. తామేం చేయగలమో చెప్పి ఒప్పించేలా ప్రజల్లోకి వెళ్తేనే నాలుగు ఓట్లు వస్తాయి. అందుకు అన్ని పార్టీలు అనుసరించే వ్యూహమే పాదయాత్ర. గతంలో ఎంతోమంది పాదయాత్రలతోనే అధికారం దక్కించుకున్నారు. ఇప్పుడు ఏపీలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ కూడా ఆ బాటలోనే పయనిస్తోంది. యువగళం పేరుతో నారా లోకేష్‌‌ యాత్రలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసినా వయసురీత్యా ఈసారి ఆ బాధ్యత లోకేష్‌కి అప్పగించారు. కానీ ఇది ఎంతమేర సక్సెస్ అవుతుంది..?. లోకేష్ అసలు జనాల్లోకి రీచ్ అవగలుగుతున్నారా..? ప్రభుత్వంపై విరుచుకుపడుతూ చేస్తున్న ప్రసంగాలు జనాలను డైవర్ట్‌ చేస్తున్నాయా.. అనేది చర్చనీయంగా మారుతోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా లోకేష్‌తో కాదని డిసైడ్ అయినట్లే కనిపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు దూకుడు పెంచారు. ఓ వైపు లోకేష్‌ యాత్ర చేస్తుండగా.. తాను జిల్లాల్లో పర్యటనలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని యాక్టివ్‌ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే లోకేష్‌ తన పని తాను చేస్తుంటే..చంద్రబాబు అధినేతగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారా..? లేక లోకేష్‌ యాత్ర తమకు కలిసిరాకున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే బెటర్‌ అనే భావనతో మీటింగులు పెడుతున్నారా అనేది క్లారిటీ లేకపోయినా.. లోకేష్‌ మీద నమ్మకం లేకే చంద్రబాబు రంగంలోకి దిగినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక కొద్దిరోజులుగా వివేకా హత్య కేసు హాట్‌టాపిక్‌గా మారుతోంది. సీబీఐ దూకుడు పెంచడం.. భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేయడం.. అవినాష్‌ రెడ్డిని విచారణకు పిలవడంతో టీడీపీ ఈ విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. వైఎస్ ‌జగన్‌కు సోదరుడైన వ్యక్తి ఈ కేసులో విచారణ ఎదుర్కోవడంతో తమ వ్యూహం మొత్తం వివేకా మర్డర్ కేస్‌ని బేస్‌ చేసుకుని మార్చేసుకుంది. సాధారణంగా రాజకీయాల్లో ఎక్కడ అవకాశం దొరికినా పార్టీలు అందిపుచ్చుకోవాల్సిందే. అందులో భాగంగానే వివేకా హత్యకేసు తమకు ప్లస్ అనుకొని టీడీపీ ఫోకస్‌ పెంచిందని కొందరు అనుకుంటే.. లోకేష్‌ యాత్రకి వచ్చే రెస్పాన్స్‌తో పనికాదన్న నిర్ణయంతోనే టీడీపీ వివేకా కేసుకి డైవర్ట్ అయిందని కొందరు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories