Chandrababu: కుప్పం ప్రజలకు బాబు భరోసా.. సొంత నిధుల‌తో..

Chandra babu
x
చంద్రబాబు ఫైల్ ఫోటో 
Highlights

Chandrababu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించారు.

Chandrababu: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష‌నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించారు. కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం రూ.1 కోటి ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కుప్పంలోని పార్టీ నేతలతో శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గంలో యుద్ధప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని, సిబ్బంది కొరతను తీర్చాలని స్థానిక నాయకులను ఆదేశించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న టెలి మెడిసిన్, ఆహార పంపిణీ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 పడకలు, ఓకేషనల్జూ నియర్ కళాశాల నూతన భవనంలో 200 పడకలు చొప్పున ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు.

వైద్య సిబ్బంది కొరతను కూడా తీర్చేందుకు వెంటనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా సిబ్బంది నియామకాలు చేపట్టాలని, దానికి కావలసని నిధులు కూడా సమకూరుస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రి మొదటి అంతస్తులో ఆక్సిజన్ సరఫరాను గ్రౌండ్ ఫ్లోర్‌కి అందేలా మరమ్మతులు వెంటనే చేయించాలని సూచించారు.దీని గురించి వెంటనే జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తానని తెలిపారు.

కుప్పం ప్రజల శ్రేయస్సు కోసం ఈ పనులన్నీ చేయాలనుకుంటున్నానని, దీనికి దాదాపు రూ.కోటిని వరకు ఖర్చవుతుందని చంద్ర‌బాబు చెప్పారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కావాల్సిన పల్స్ ఆక్సీమీటర్లను కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శనివారం అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్న 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కావలసిన మెడిసిన్ వివరాలు తెలుసుకొని, వాటిని వెంటనే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories