Chandrababu : కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు

Chandrababu : కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది: చంద్రబాబు
x

chandrababu naidu 

Highlights

Chandrababu : కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తగా చేతులెత్తేసిందని అన్నారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు...

Chandrababu : కరోనా వైరస్ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తగా చేతులెత్తేసిందని అన్నారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... కరోనా బాధిత కుటుంబాలు, కరోనా విజేతలు, వైద్యనిపుణులతో ఈ రోజు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో కనీసం పడకలు లేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు చంద్రబాబు.. ఇక వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు వసూలు చేస్తున్నారని అన్నారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వచ్చేవరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

అటు కరోనా వలన ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న అన్న చంద్రబాబు.. కరోనా వలన ఆర్ధికంగా నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇక చేతివృత్తులు, కులవృత్తులు, భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారిని ఆదుకోవడం కోసం ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున ఆర్థికసాయం చేయాలనీ అన్నారు.

ఇక ఏపీలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. బుధవారం నాటికి ఉన్న సమాచారం మేరకు కొత్తగా రాష్ట్రంలో 10,392 కొత్త కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 60, 804 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,392 మంది కోవిడ్-19 బారిన పడ్డారు.. ఇక మరో 8,454 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రములో కొత్తగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 4,55,531 కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో 1,30,076 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories