టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక ఫ్లెక్సీ కోపం తెప్పింది. అదే పనిగా ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత చికాకు తెప్పించింది. వెంటనే ఆ ఫ్లెక్సీ...
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక ఫ్లెక్సీ కోపం తెప్పింది. అదే పనిగా ఆ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ కావడం మరింత చికాకు తెప్పించింది. వెంటనే ఆ ఫ్లెక్సీ వేసిన నేతలకు తలంటుపోశారట. ఇంకోసారి ఇలాంటివి రిపీటైతే, చుక్కలు చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారట. చంద్రబాబులో బీపీ మీటర్ పెంచేసిన, ఆ ఫ్లెక్సీ మ్యాటరేంటి? అందులో ఏముంది?
ఇప్పటికే అనేక తలనొప్పులతో సతమతమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ నేతలు మరిన్ని చికాకులు తెప్పిస్తున్నారు. జనసేన బీజేపీతో జట్టుకట్టడం, ఎమ్మెల్యేలు, నేతలు ఇతర పార్టీల వైపు చూస్తుండటంతో అసహనంతో రగిలిపోతున్న బాబుకు, ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు యమ కోపం తెప్పించే పని చేశారట. ఇంతకీ ఏంటది?
ఇదిగో ఇదే చంద్రబాబుకు కోపం తెప్పించిందట. నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలంటూ, ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు వేయించిన ఈ ఫ్లెక్సీ, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫ్లెక్సీ మొత్తం టీడీపీ అనే వుంది కదా, లోకేష్ బొమ్మ కూడా వుంది కదా, బాబుకు ఎందుకు కోపం వచ్చిందన్న డౌట్ రావొచ్చు. సరిగ్గా సైడ్‌లో పెద్దగా కనిపిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫోటోనే బాబులో ఆగ్రహజ్వాలకు కారణమైందట. పెద్ద సైజులో వున్న ఫోటో ఒక్కటే కాదు, దానికిందున్న మ్యాటరే, బీపీ మీటర్ పెరిగేలా చేసిందట. ఇంతకీ అక్కడ ఏముందో ఒక్కసారి లుక్కేయండి.
గమనించారా బాబులో బీపీ పెంచిన మ్యాటరేంటో రాబోయే కాలానికి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అట. 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జూనియర్ అట. ఇవే అక్షరాలపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారట. ఎవరు ఈ ఫ్లెక్సీ వేయించారు, ఎందుకు అదేపనిగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ కోప్పడ్డారట. ఫ్లెక్సీ ప్రింట్ చేయించిన టీడీపీ నేతలకు క్లాస్ పీకారట. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే, తీవ్రమైన చర్చలు తప్పవని హెచ్చరించారట.
జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అన్న ఫ్లెక్సీ బాబుకు ఇంతగా కోపం రగిలించడం సహజమేనంటున్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే తనకు వయసు మీదపడుతోందని, ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోతారని ప్రత్యర్థి పార్టీ నాయకులు అదేపనిగా మాట్లాడుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం తనకింకా వయసు అయిపోలేదని, ఆరోగ్యంగా ఉన్నానని చాలాసార్లు చెప్పారు. అయితే, ఆయన తర్వాత నాయకుడు ఎవరన్న చర్చకు మాత్రం, బాబు సమాధానం తెరదించడం లేదు. చంద్రబాబు తర్వాత లోకేష్‌కు బాధ్యతలు అప్పగిస్తారని, ఇదే టైం చూసుకుని, జూనియర్ ఎన్టీఆర్ ఎంటరై, పార్టీ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని, తిరుగుబాటు బావుటా ఎగరేస్తారన్న ఊహాగానాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ సీనియర్లు సైతం, జూనియర్ ఎన్టీఆర్‌కు పగ్గాలు అప్పగించాలని, అప్పుడే పార్టీ నిలబడుతుందని బాహాటంగానే చెబుతున్నారు. ఇలాంటి చర్చల నేపథ్యంలోనే చాలామంది తారక్‌పై ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే చంద్రబాబుకు కోపం తెప్పిస్తోంది.
తన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన కొడుకు లోకేషే పార్టీ అధినేత కావాలన్నది బాబు పట్టుదల అని, ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లోకేష్‌కు పోటీ అవుతాడనే జూనియర్‌ను బాబు పక్కనపెట్టారని అంటున్నారు. జూనియర్ గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా చిరాకుపడుతున్నారట బాబు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బాబుకు కోపం తెప్పించిందట. వెంటనే ఆ ఫ్లెక్సీ కట్టిన నేతలపై ఫైరయ్యారట. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్‌పై ఫ్లెక్సీనే తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, నిజంగా పార్టీలో అలాంటి తిరుగుబాటు జరిగితే తట్టుకోగలరా అంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు మాట్లాడుకుంటున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire