Chandrababu Naidu Fires on YCP government : వైఎస్‌ వివేకా హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం

Chandrababu Naidu Fires on YCP government : వైఎస్‌ వివేకా హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారు.. ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం
x
Highlights

Chandrababu Naidu Fires on YCP government: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారని జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారుt :

Chandrababu Naidu Fires on YCP government: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి 13 నెలలైనా హంతకులను పట్టుకోలేకపోయారని జగన్ సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన కారణంగానే మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారని ఆరోపించారు. చీమకు కూడా అపకారం చేయని మనిషి కొల్లు రవీంద్ర అని ఆయన అన్నారు. పార్టీ నాయకులతో ఆయన ఆదివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. ఈ మేరకు పార్టీ నాయకులతో ఆయన ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొల్లు రవీంద్రను ఇరికించేందుకే కాల్స్‌ డ్రామా ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఆధిపత్య పోరులో పరస్పరం హత్యలు చేసుకున్నారని, రెండు కుటుంబాల మధ్య కక్షలను రెచ్చగొట్టింది వైసిపినే అని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించిన ఇళ్లను ఇంతవరకు పేదలకు అందించలేదని, టీడీపీపై కక్షతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా వేధిస్తున్నారనీ మండిపడ్డారు. హౌసింగ్‌ పెండింగ్‌ బిల్లులు, ఇళ్ల స్వాధీనంపై టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో వైసీపీ వేధింపులపై సోమవారం నుంచి నిరసనలు తెలపాలని పార్టీ నేతలకు సూచించారు. ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై ఈ నెల 7న నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్లో మంత్రి పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నాయకుడు మోకా భాస్కర్‌ రావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్‌ విధించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొల్లు రవీంద్రను మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. మోకా భాస్కర్‌రావును కొల్లు రవీంద్ర ప్రోద్బలంతోనే హతమార్చినట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories