వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని పరస్థితి : చంద్రబాబు

వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని పరస్థితి : చంద్రబాబు
x
Chandrababu Naidu (File Photo)
Highlights

వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని పరస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

వైసీపీ అరాచకాలతో రాష్ట్రానికే కాదు దేశానికే పెట్టుబడులు రాని పరస్థితి ఏర్పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు చేతకాని పాలన కారణంగా దేశ విదేశాల్లో తెలుగువారు నవ్వులపాలవుతున్నారని ఆయన అన్నారు.

టీడీపీ పాలనలో రాష్ట్రానికి 667 అవార్డులు వచ్చాయని చంద్రబాబు వివరించారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, రాష్ట్రానికి మూడు రాజధానులు, శాసనమండలి రద్దు వంటి చర్యలతో పరిస్థితి దిగజార్చారని పేర్కొన్నారు. విభజన తర్వాత రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో కూడా ఏపీ టీడీపీ పాలనలో తలెత్తుకునేలా ఎదిగిందని, పెట్టుబడులకు గమ్యస్థానంగా మారి దేశంలోనే నెంబర్ వన్ అయిందని చంద్రబాబు తెలిపారు.

దావోస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ప్రధానాకర్షణగా ఉండేదని, ఏపీని వేధింపులకు వేదికగా మార్చిన ఘనత వైసీపీ పాలకులదేనని ఆరోపించారు. వాటాల కోసం బెదిరించి పెట్టుబడిదారులను తరిమేశారని, పాలకులు బాధ్యతగా ప్రవర్తించినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని, ఇలాంటి చేతకాని పాలకులుంటే రాష్ట్రం నవ్వులపాలేనంటూ సోషల్ మీడియాలో స్పందించారు. నారా లోకేశ్ కూడా రాష్ట్ర పరిస్థితిపై వ్యాఖ్యానించారు. ప్రిజనరీ దెబ్బకు రాష్ట్ర పరువు గంగలో కలిపోయిందని ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories