Raghu Ramaకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని -చంద్రబాబు

TDP Chief ChandraBabu Letter To AP Governer
x

చంద్రబాబు ఫైల్ ఫోటో  

Highlights

Raghu Rama: వైసీసీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్.. ఏపీ రాజ‌కీయాల్లో హీట్ పుట్టిస్తోంది.

Raghu Rama: వైసీసీ రెబ‌ల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ అంశం ఏపీ రాజ‌కీయాల్లో పెనుదూమారం రేపుతుంది. రాఘురామ అరెస్ట్ పై ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వాన్ని కార్న‌ర్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో్ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. ఎంపీ ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నానంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు.

తనకు ప్రాణహాని ఉందని రఘురామ గతంలోనే చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం గుర్తించే కేంద్ర ప్రభుత్వం వై-కేటగిరీ భద్రత కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యలపై గళం వినిపించినందుకే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కులాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన రఘురామకృష్ణరాజుకు సీఐడీ స్పెషల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే.

రఘురామకృష్ణరాజు పై ఐపీసీ 124-ఏ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు కొట్టారని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు ఆరోపించగా, అవి గాయాలు కాదని పోలీసుల తరఫు న్యాయవాదులు స్పష్టం చేశారు. మెడికల్ రిపోర్ట్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. మరోవైపు ఎంపీ రఘురామను గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories