బద్వేల్‌ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన, టీడీపీ ప్రకటన..

TDP and Janasena Declared that They are Out of Badevl By Elections 2021 | AP News Today
x

బద్వేల్‌ ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు జనసేన, టీడీపీ ప్రకటన..

Highlights

Badvel By Elections 2021: *బద్వేల్‌ ఉపఎన్నికపై కొననసాగుతున్న ఉత్కంఠ *రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు

Badvel By Elections 2021: బద్వేల్ బైపోరు రసవత్తరంగా మారింది. నిన్న మొన్నటి వరకు అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాయి. అన్ని పార్టీలు బరిలో ఉంటాయని భావించినా.. ఒక్కొక్క పార్టీ పోటీ నుంచి తప్పుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ బద్వేల్‌లో పోటీ చేయట్లేదని ప్రకటించారు. ఇక నిన్న టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. సాంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.

ఇదిలా ఉండగా పోటీపై బీజేపీ ఎటూ తేల్చుకోలేకపోతుంది. జనసేన పార్టీతో చర్చించి అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటామన్న సోమువీర్రాజు.. బరిలో ఉండట్లేదని పవన్ స్పష్టం చేయడంతో బీజేపీ డైలామాలో పడింది. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు రాష్ట్ర నాయకత్వం నడుచుకుంటోందని చెబుతోంది బీజేపీ.

బద్వేల్‌‌లో పోటీపై కాంగ్రెస్ పార్టీ స్పష్టతకు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎంపికపై సమీక్షలు జరిపినా.. ఇప్పటి వరకు పేరు ప్రకటించలేదు హస్తం పార్టీ. జనసేన, టీడీపీ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక టీడీపీ, జనసేన పోటీ నుంచి తప్పుకుంటుండటంతో పలువురు ఇండిపెండెంట్లు పోటీపై ఆసక్తి చూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories