తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

Swarna Radhotsavam in Tirumala
x

తిరుమలలో వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

Highlights

Tirumala: ఘనంగా తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి స్వర్ణరథంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు.

రథోత్సవంలో పాల్గొనడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు.. భూదేవి కరుణతో సమస్త ధాన్యాలూ.. శ్రీవారి కరుణా కటాక్షాలతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వసంతోత్సవాలకు భారీగా హాజరైన భక్తులు గోవింద నామస్మరణలో తరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories