Chandrababu: చంద్రబాబుపై కేసుల విచారణలో ఉత్కంఠ.. కీలక పిటిషన్లపై ఇవాళ విచారణ

Suspense In The Investigation Of Cases Against Chandrababu
x

Chandrababu: చంద్రబాబుపై కేసుల విచారణలో ఉత్కంఠ.. కీలక పిటిషన్లపై ఇవాళ విచారణ 

Highlights

Chandrababu: మూడో రోజు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబు

Chandrababu: ఏపీ హైకోర్టులో ఇవాళ చంద్రబాబుకు సంబంధించిన కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇవాళ ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది. మరో వైపు హౌస్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టివేసిన నేపథ్యంలో కస్టడీ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఏసీబీ కోర్టు జ‌డ్జి హిమ‌బిందు తిర‌స్కరించిన హౌస్ రిమాండ్ పిటిష‌న్‌ను హైకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు స‌వాల్ చేశారు. అక్కడ న్యాయం జ‌రుగుతుంద‌ని ఆయన తరపు లాయర్లు విశ్వసిస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. మరో వైపు ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్టుపై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చిన రిమాండ్‌ రిపోర్టును క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.

మరో వైపు చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజ‌మండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు బ‌య‌ట‌కు రాగానే మ‌రో కేసులో అరెస్ట్ చేయ‌డానికి ఏపీ సీఐడీ సిద్ధంగా ఉంది. మరో వైపు అమ‌రావ‌తి రింగ్ రోడ్ అలైన్‌మెంట్ పాటు ప‌లు కేసుల్లో నిందితునిగా చంద్రబాబును ఏపీ సీఐడీ పేర్కొంది. ఆ కేసుల విచార‌ణ‌ను ఆపాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories